'చంద్ర'గిరి పైనే రోజా గురి

అయితే ఇది గమనించిన రోజా తనకు నగరిలో సీట్ ఇవ్వాలని ఇంతకు ముందే అడిగింది. చంద్రబాబు ఆ సీటు ముద్దు కృష్ణమనాయుడుకి ఇచ్చేదని,ఆయన ఆ షరతు పైనే పార్టీలోకి ఎంటర్ అవబోతున్నారని చెప్పారని అంతర్గత పార్టీ వర్గాల కథనం. సర్లే మీ తమ్ముడు రామ్మూర్తి నాయుడు గతంలో పోటీ చేసిన చంద్రగిరి అయినా తనకు ఇవ్వమని ఆమె పట్టుపడుతోందని లేటెస్ట్ ఇష్యూ. ఆ సీటు అనారోగ్యం కారణం చూపి రామ్మూర్తినాయుడుకే ఇవ్వక వేరే వాళ్ళకి కట్టపెడదామనే ఆలోచనలో ఉన్న బాబుకి ఈ విషయం మింగుడు పడంటంలేదు. అందులోనూ ఆయన తన బంధువులతో రామ్మూర్తినాయుడుకి ఎమ్.ఎల్.సి సీటు ఇస్తానని చెప్పటం దీన్ని బలపరుస్తోంది. మరో ప్రక్క రాజకీయంలో పండిపోయిన రోజాని బుజ్జగించేందుకు రాజ్యసభకు పంపుతానని ఆయన హామీ ఇస్తున్నారు. అలా అయినా ఆమెను రాష్ట్రమంతా తిప్పాలని యోచిస్తున్నారు. అటు రోజా...తన రాజకీయ గురువులాంటి చంద్రబాబు ఎవరి స్క్రీమ్ ల్లో వారున్నారు. ఆమె గట్టిగా పట్టుపడితే తప్పదు కానీ అప్పటి వరకూ తిప్పవచ్చుకదా.












Click it and Unblock the Notifications