జాన్ అబ్రహం, ఐశ్వర్యారాయ్ లు నటించనున్న శ్రీరాం రాఘవన్ కొత్త సినిమా షూటింగ్ లో జాప్యం జరిగే అవకాశాలున్నాయి. ఐశ్వర్యా రాయ్ డేట్స్ ఇవ్వకపోవడం వల్లనే షూటింగ్ లో ఆలస్యం జరుగుతోందని అంటున్నారు. దీంతో జాన్ అబ్రహం నిరాశనకు లోనైనట్లు సమాచారం. దాంతో ఆయన ఈ ప్రాజెక్టునుంచి తప్పుకోవాలని అనుకుంటున్నట్లు సమాచారం. దెబ్బ మీద దెబ్న అన్నట్లు జాన్ పై మరో పిడుగు కూడా పడింది. తన ప్రియురాలు బిపాషా బసుతో కలిసి కెన్యాకు జాలీ ట్రిప్పు వేయాలని జాన్ ఉబలాటపడ్డాడు. అయితే ఆ దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల వల్ల ఆ హాలిడే ట్రిప్పును అతను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఏమైనా ఐశ్వర్యారాయ్ వ్యవహారం రాఘవన్ కు కూడా ఇబ్బందిగానే ఉంది.