వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'సాక్షి' చానల్ లో సుమన్!

By Staff
|
Google Oneindia TeluguNews

Suman
రామోజీరావు చిన్న కుమారుడు సుమన్ "సాక్ష్" పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూను వీడియోగా కూడా చిత్రీకరించినట్టు తెలుస్తోంది. పక్కన ప్రభాకర్ ఉండగా నాలుగు గంటల పాటు సుమన్ ఇచ్చిన ఇంటర్వ్యూను త్వరలో రానున్న "సాక్షి" చానల్ లో "డైలీ సీరియల్" గా రెండు వారాల పాటు ప్రసారం చేయనున్నట్టు ఎలక్ట్రానిక్ మీడియా వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.

తండ్రి రామోజీరావు మీద టీవీ సీరియల్ ఫక్కీలో సుమన్ నిప్పులు కక్కిన విషయం తెలిసిందే. "ఆయన గొప్ప వ్యక్తే కావచ్చు, మంచి తండ్రి కాదు" అని సుమన్ చేసిన వ్యాఖ్య సంచలనం సృష్టించింది. రామోజీరావుకు డబ్బు, వ్యాపారం తప్ప మానవ సంబంధాల మీద నమ్మకం లేదన్న అభిప్రాయం కలిగించడానికి సుమన్ ప్రయత్నించారు. కానీ ఆ ఇంటర్వ్యూ తర్వాత జనానికి సుమన్ మీద సానుభూతి కంటే రామోజీరావు మీద గౌరవం పెరిగినట్టు ఫీడ్ బ్యాక్ మెయిల్స్ ద్వారా తెలుస్తోంది,

సుమన్ ఇంటర్వ్యూను "సాక్షి" చానల్ సీరియలైజ్ చేస్తే ఆ చానల్ రేటింగ్ అద్భుతంగా ఉండవచ్చు కానీ, దానివల్ల రామోజీరావు హీరోయిజం మరింత పెరిగే అవకాశం ఉంటుందేమోనని ఆ చానల్ లో మల్లగుల్లాలు జరుగుతున్నాయి. సుమన్ ఇప్పుడు "సాక్షి" కార్యాలయాలకు దగ్గరలోనే లక్ష్మీ పార్వతి ఇంటి సమీపంలో ఒక ఇండిపెండెంట్ హౌస్ ను అద్దెకు తీసుకుని ఉంటున్నారు. అద్దె, సర్వెంట్స్, కుక్, డ్రైవర్ తదితర ఖర్చులన్నీ రామోజీరావే చెల్లించడం కొసమెరుపు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X