ఆయనొక్కటి తలిస్తే బాలయ్య మరోటి...

Balakrishna
కొన్ని కాంబినేషన్స్ కలసి వస్తాయి. మరి కొన్ని వికటిస్తాయి. అయితే కలసి వచ్చిన వాటిని కొనసాగించాలనుకోవటం మానవ నైజం. సరిగ్గా కొద్ది సంవత్సరాల క్రితం ఎస్.గోపాల రెడ్డి విషయంలో అదే జరిగింది. అయితే ఆయన తన వరస హిట్స్ ని తిరిగి కొనసాగించాలనుకున్నారు. గోపాల్ రెడ్డి ఒక్కటి తలిస్తే బాలయ్య మరోటి తలిచారు. అదే గోపాల్ రెడ్డికి తంటా తెచ్చి పెట్టింది. అయితే అది సక్రమంగా జరగక ఆయన్ని తీవ్ర మనో వేదనకు గురిచేసింది.

ఎస్.గోపాల రెడ్డి 1980ల్లో నిర్మాతగా పరిశ్రమలోకి ప్రవేశించారు. ఆ తర్వాత తన కుమారుడు పేరున భార్గవ ఆర్ట్స్ బ్యానర్ ని పెట్టడం జరిగింది. అదే ఊపులో కొన్ని సినిమాలు డబ్బింగ్ చేయటం ద్వారా హిట్స్ రుచి చూసారు. దర్శకుడు కోడి రామకృష్ణ , బాలకృష్ణ కాంబినేషన్ లో 'మంగమ్మ గారి మనవడు' మొదలుకుని ఎన్నో సూపర్ హిట్స్ సాధించారు. ఆ తర్వాత పరిశ్రమలో మారుతున్న పరిస్ధితులకు మౌల్డ్ కాలేక సినిమాలు తీయటం మానుకున్నారు.

అయితే అది ఎంతో కాలం కొనసాగలేదు. కొంత కాలం గ్యాప్ తర్వాత భార్గవ ఆర్ట్స్ బ్యానర్ పై కలిసి వచ్చిన హీరో బాలకృష్ణ తో ..పూజా బాత్రా హీరోయిన్ గా కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఓ జానపద చిత్రం లలిత కళా తోరణంలో గ్రాండ్ గా ప్రారంభించారు. అయితే ఆ సినిమా కొంత షూటింగ్ జరుపుకుని ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది అనే నిజం సినిమా వాళ్ళకి తప్ప బయిటి వాళ్ళకు తెలియరాలేదు. అయితే ఇప్పుడు ఆయన మరణాననంతరం అది ఒక చర్చగా మారింది.

అప్పట్లో ఆ సినిమా షూటింగ్ నిమిత్తం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీగా సెట్స్ వేయటం జరిగింది. అయితే మొదట షెడ్యూల్ జరుగుతున్నప్పుడే బాలకృష్ణ కీ దర్శకుడు కోడి రామకృష్ణ కీభేధాభిప్రాయాలు వచ్చాయి. దాంతో కారణాలు చెప్పకుండా బాలకృష్ణ అర్జెంటుగా డైరక్టర్ ని మార్చమన్నారుట. దాంతో కొంత షూటింగ్ జరగటం, చాలా ఖర్చు పెట్టడం జరిగిందని ఆయన వారిని కన్వీన్స్ చేయటానికి ప్రయత్నించారుట. అయితే బాలయ్య ఒప్పుకోలేదుట. దాంతో సినిమా ఆగిపోయింది.

తర్వాత ఒక సంవత్సరం అనంతరం గోపాలరెడ్డి తిరిగి బాలయ్యను కలస్తే ప్రాజెక్టు ఆపటమెందుకు అని సి.వి.రావు అనే మరో సీనియర్ దర్శకుడుని ప్రతిపాదించాడుట. దాంతో తప్పని స్ధితిలో ఒఫ్పుకున్న గోపాలరెడ్డి మళ్ళీ సినిమా ప్రారంభించటానికి సన్నాహాలు చేస్తూ...సి.వి.రావుని సీన్ లోకి తెచ్చారు. అయితే సీ.వి.రావు ఆ సెట్స్ చూసి అవి తను డైరక్ట్ చేయటానికి పనికిరావని మార్చాల్సిందేనని ఖచ్చితంగా చెప్పాడుట. అయితే దీనికి ప్రిపేర్ కాని గోపాల్ రెడ్డి క్రుంగి పోయారుట. సెట్స్ మారిస్తే అప్పటివరకూ షూట్ చేసిన పార్ట్ ఏం చేయాలి ...దానిపై పెట్టిన భారీ ఖర్చు పరిస్ధితి ఏంటన్నది ఆయనకు అంతు చిక్కలేదుట.

పరిశ్రమవాసులు చెప్పుకునే దాని ప్రకారం అప్పటికే ఏడు కోట్లుకు పైగా ఖర్చుపెట్టాడని ఫైనాన్సియర్స్ ఒత్తడి,ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ప్రాజెక్టు ఆగిపోవటం ఆయన జీర్జించుకోలేకపోయారని,దగ్గరవారి దగ్గర చెప్పుకుని భాధ పడ్డారని చెబుతారు. ఇక ఆ తర్వాత ఆయన కుమారుడు బార్గవ్ ని నిర్మాతగా చూడాలని సినిమా ప్రారంభించే ప్రయత్నం చేసారు కానీ సక్సెస్ కాలేదు. మధ్యలోనే ఆగిపోయింది. అయితే ఈ విషయాలన్నిటికీ బాలయ్యని భాధ్యులని చేయలేమనేది కొందరి వాదన. ఇటువంటి సంఘటనలు కామనే అని సర్ధుకుని తిరిగి ప్రస్ధానం కొనసాగించాల్సిందేనని అది ఆయన చెయ్యలేకపోయారని అంటారు. అయితే ఎవరేమన్నా ఇప్పుడు ఆయన మన మధ్య లేరు. ఎవరేం చెప్పినా ఫలితం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+