మీడియాకు మినహాయింపా?
ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా అనుమతి కూడా తీసుకోకుండా గొట్టాలు తీసుకుని అక్కడ వాలిపోయే టీవీ చానళ్ళ వారు నేటి ఉదయం టీవీ5 అసోసియేట్ ఎడిటర్, వ్యాఖ్యాత కరీముద్దీన్ అలియాస్ కరీంపై దాడి జరిగినప్పుడు ఎందుకు మౌనం వహిస్తున్నాయి. కరీం ఆంధ్రప్రదేశ్ లో అందరికీ తెలిసిన వాడే. అతని చుట్టూ వైవాహిక వివాదాలే కాక రియల్ ఎస్టేట్ సంబంధ రాకెట్లు ఉన్నాయి.
కరీం మీద సాటి మీడియా సంస్ధలకు సానుభూతి ఉండవచ్చు. కానీ సమాచారం తెలుసుకునే హక్కు ప్రేక్షకులకు ఉండకూడదా? ఈ వార్తను రేపు దినపత్రికలు ఎటూ ప్రచురిస్తాయేమో. కానీ ఈలోపు టీవీ చానళ్ళు ఎందుకు మౌనం వహించినట్టు? ఎన్ని ఆరోపణలు ఉన్నా కరీంను ఆయా టీవీల యాజ మాన్యాలు ఎందుకు భరిస్తున్నట్టు? ఇప్పుడు అతను ఆపదలో ఉంటే ఉండవచ్చు. కానీ అతను మీడియా ద్వారా చేసిన మంచి పనులను, వ్యక్తిగత జీవితంలో చేసిన చెడు పనులను ప్రేక్షకులకు వివరించాల్సిన బాధ్యత టీవీ మీడియాకు లేదా? ఇలాగైతే మెరుగైన సమాజం ఎలా సాధ్యం?












Click it and Unblock the Notifications