చిరు బాటలో రజనీకాంత్?

ఇటువంటి సమావేశాలు పెట్టుకోవద్దని రజనీకాంత్ సెక్రటరీ సత్యనారాయణ కోరుతున్నా, అభిమానుల ఉత్సాహం చల్లారకపోగా ఇంకా పెరుగుతోంది. వల్లువార్ కొట్టం వద్ద నేడు వందలాది మంది రజనీ అభిమానులు గుమికూడి భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో రజనీకాంత్ చిరకాల మిత్రుడు చిరంజీవి పార్టీ సూపర్ హిట్ గా దూసుకెళ్తుండడంతో తమిళనాడులోని రజనీకాంత్ అభిమానుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. అవినీతి ఊబిలో కూరుకుపోయిన డిఎంకె, అన్నా డిఎంకెలకు పోటీగా రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చి, అవినీతి రహిత సమాజాన్ని స్ధాపించాలని రజనీకాంత్ అభిమానులు కోరుకుంటున్నారు.
ఎన్నికల ముందు ప్రతి రాజకీయ పార్టీ చిరంజీవి మద్దతును ఆశిస్తుంటాయని, ఎన్నికల తర్వాత ఆయనను పట్టించుకోవడం లేదని, ఈ పరిస్ధితి పోవాలంటే రజనీకాంత్ స్వయంగా రాజకీయ పార్టీ స్ధాపించి అధికారంలోకి రావలసిన అవసరముందని అభిమానులు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications