వైఎస్ అతి విశ్వాసం ఫలిస్తుందా?

ఈసారి ఎలాగైనా అధికార పగ్గాలు చేపట్టాలని పట్టుదలగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ధనబలంతో ఓటర్లను ఆకర్షించే అవకాశముంది. జనం బాగా తెలివిమీరి ఉన్నారు. డబ్బు పుచ్చుకున్నా ఆ పార్టీకి వారు ఓటేస్తారన్న పూచీ లేదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంతవరకు వర్షాలు, వ్యవసాయ పనుల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యతిరేకత లేదు. అదొక్కటే అనుకూల అంశం. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రాణాంతకమయ్యే అవకాశముంది.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచారాన్ని ముఖ్యమంత్రి వైఎస్ ఒంటి చేత్తో నడిపించవలసి ఉంటుంది. ఆయన మంత్రుల్లో ఎవరికీ చెప్పుకోదగినా చరిష్మా లేదు. వారి పనితీరు కూడా అంతంత మాత్రంగా ఉండడంతో ఆయా జిల్లాల్లో వారి ప్రభావం అతి తక్కువగా ఉంది. టి డిపి, ప్రజారాజ్యం పార్టీలు సినిమా గ్లామర్ ను రంగంలోకి దింపుతున్న నేపధ్యంలో వైఎస్ తన గ్లామర్ నే పణంగా పెట్టి కదనరంగంలోకి రావలసిన అవసరముంది.












Click it and Unblock the Notifications