బాలయ్య పనికొస్తాడా?

Balakrishna
బాలకృష్ణని త్వరలో పూర్తి స్ధాయి రాజకీయాల్లోకి రప్పించటానికి చంద్రబాబు ఆలోచన చేస్తున్నాడని పొలిటికల్ సర్కిల్స్ లో బలంగా వినపడుతోంది. దాంతో బాలయ్య ఫుల్ టైమ్ రాజకీయాల్లా రాణించగలడా అని అందరిలో అనుమానాలు కలగుతున్నాయి. ఎలక్షన్ టైమ్ లో ఉపన్యాసాలు ఇవ్వటంలో ఫెయిల్యూర్ అయిన బాలయ్య పూర్తి స్ధాయిలోకి వస్తే ఎంతవరకూ వర్కవుట్ అవతాడనే సందేహాలు వస్తున్నాయి.అందులోనూ బాలయ్య ప్రస్తుతం రెండు సినిమాలు కమిట్ అయ్యి ఉన్నారు.

అంతేగాక ఎలక్షన్స్ సమయంలో బాలయ్య ఇంపాక్ట్ ఎంతవరకూ పార్టీ వర్గాలపై,ఓట్లను ప్రభావితం చేసిందన్న దానిపై చర్చలు సైతం జరుగుతున్నాయి. అందులోనూ గ్రేటర్ ఎన్నికలుకు రంగం సిద్దమవుతున్నసమయంలో ఈ చర్చ రావటం అందరినీ ఆలోచనలో పడేస్తోంది. అంతేగాక చిరంజీవి ..ప్రజారాజ్యం రోజురోజుకీ బలహీనపడతూండటంతో సినీ గ్లామర్ తమకు మాత్రం ఎంతవరకూ ప్లస్ అవుతుందనే భావన కొందరు బహిరంగంగానే చర్చిస్తున్నారు. ఇవికాక చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. వాటిని పూర్తి చేస్తూ పార్టీకి ఎంతవరుకూ న్యాయం చేయగలడన్న సందేహం సైతం అందరిలో కలుగుతోంది.

అయితే ఎలాగో జూనియర్ ఎన్టీఆర్ పార్టీ వైపు తొంగి చూడటం లేదు. దాంతో పార్టీ వర్గాల్లో ఉత్సాహం రప్పించటానికైనా బాలయ్యతో ప్రచారం చేయించాలని బాబు భావిస్తున్నారు. బాలకృష్ణ సైతం దీనికి సముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే బెల్లంకొండతో చేయనున్న భీష్మ,బోయపాటి చిత్రాలుకు డేట్స్ ఇబ్బంది అని బావిస్తున్నట్లు సమాచారం. అందులోనూ చంద్రబాబుతో కొందరు సీనియర్స్ ఇప్పటికే ఎన్టీఆర్ పేరుని ఎలక్షన్స్ సమయంలో తప్ప తలుచుకోవటం లేదని,అదే పార్టీకి ముప్పుగా భావిస్తోందని హెచ్చరించినట్లు చెప్తున్నారు.

హరికృష్ణతో నైనా ఆ లోటు తీరుద్దామనుకుంటే ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని బాలయ్యను పొలిటికల్ బ్యూరోలోకి తీసుకెళ్ళి పూర్తి స్ధాయి రాజకీయనాయకుడు చేసే ఆలోచన చేస్తున్నారు. మొత్తానికి బాలయ్య మనసా,వాచా రాజకీయాలు చెయ్యాల్సిన టైమ్ వచ్చేసిందన్నమాట. అయితే అది ఓట్లని,పార్టీ నాయకులని ప్రభావితం చేయగలిగితేనే ఏదన్నా ఉపయోగం. అంతేగాని జనాన్ని సభలకు రప్పించటం వరకూ మాత్రమే ఉపయోగపడితే లాభం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+