వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పురంధరేశ్వరిపై పోటీకి బాలయ్య నో!

By Staff
|
Google Oneindia TeluguNews

Balakrishna
సోదరి పురంధరేశ్వరిపై విశాఖపట్నం నుంచి పోటీ చేయడానికి బాలకృష్ణ ఇప్పుడు సిద్ధంగా లేనట్టు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ ఆదేశిస్తే సోదరి పురంధరేశ్వరి మీద పోటీ చేయడానికైనా తాను సిద్ధమని గతంలో ప్రకటించిన బాలకృష్ణ ఇప్పుడు ఈ విషయంలో నోరు మెదపడం లేదు. సోదరిపై పోటీ చేయడానికి ఆయన సిద్ధంగా లేనట్టు తెలుస్తోంది. ఏ పార్టీలో ఉన్నా పురంధరేశ్వరికి (చిన్నమ్మ) ఎన్టీఆర్ కుటుంబంలో ఉన్నత స్ధానం ఉంది. అందువల్ల కుటుంబసభ్యుల సలహా మేరకు బాలకృష్ణ వెనక్కి తగ్గినట్టు చెబుతున్నారు.

బాలకృష్ణ ఆవేశపరుడు కాబట్టి ఆయనను రెచగొట్టి వైజాగ్ లో పురంధరేశ్వరిపై పోటీ చేయించాలను చంద్రబాబు పెద్ద స్కెచ్ వేశారు. అది ఫలించలేదు. వైజాగ్ విషయం తెలుసుకున్న తూర్పు గోదావరి జిల్లా టిడిపి నాయకులు రెండు రోజుల క్రితం బాలకృష్ణను కలిసి రాజమండ్రి నుంచి పోటీచేయమని కోరినట్టు తెలిసింది. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలో పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయిస్తారని ఆయన అన్నట్టు చెబుతున్నారు. బాలకృష్ణను, జూనియర్ ఎన్టీఆర్ ను చంద్రబాబు నాయుడు వాడుకుని వదిలేస్తారని దగ్గుబాటి దంపతులు విమర్శించిన విషయం విదితమే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X