కొత్త సిఎం జగన్?

YS Jagan
తదుపరి ముఖ్యమంత్రిగా వైఎస్ కుమారుడు జగన్ ను నియమించాలని అధిష్టానవర్గంపై వత్తిడి పెరుగుతోంది. ఈ బాధ్యతను ప్రధానంగా మంత్రులు రఘువీరారెడ్డి,ఆనం రామనారాయణరెడ్డి, ఎంపీ లగడపాటి రాజగోపాల్ తీసుకున్నారు. ఈ సమయంలో రాష్ట్రానికి యువనాయకత్వం అవసరమని వీరి వాదన. కానీ అధిష్టానవర్గం కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి పేరును మొదట పెట్టుకున్నట్టు తెలిసింది. జగన్ పేరును కూడా పరిశీలనలోకి తీసుకుంటామని హైకమాండ్ వర్గాలు చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది.

జగన్ కు రాజకీయ పరిపక్వత లేకపోయినా ఆయనకు మార్గదర్శకత్వం వహించే వారు చాలా మంది ఉన్నారు. జ్యోతిష రీత్యా కూడా జగన్ కు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని చెబుతున్నారు. అనేక కారణాల వల్ల రాష్ట్ర నాయకత్వం చేపట్టడానికి జైపాల్ రెడ్డి ఇష్టపడడం లేదని తెలుస్తోంది. అనేక విధాలుగా ఈ ఐదేళ్ళు అధిష్టానవర్గాన్ని మెప్పించిన కెవిపి రామచంద్రరావు రంగంలోకి దిగి జగన్ తరఫున లాబీయింగ్ చేస్తున్నట్టు సమాచారం. జగన్ ను ముఖ్యమంత్రిని చేయడం ద్వారా భవిష్యత్ లో రాహుల్ ను ప్రధానమంత్రిని చేయవచ్చని సోనియా శ్రేయోభిలాషులు చెబుతున్నట్టు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+