చిరంజీవికి మరో దెబ్బ!

తిరుపతిలో చిరంజీవి అసలు పేరు గల అభ్యర్ధుల కోసం కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు గాలిస్తున్నాయి. విషయం ఏమిటంటే... చిరంజీవి పార్టీకి ఉమ్మడి గుర్తు రాలేదు కాబట్టి ఆయన కూడా ఏ ఇండిపెండెంట్ గుర్తు మీదనో పోటీ చేయవలసి ఉంటుంది. కాబట్టి ఆ గుర్తు పెద్దగా జనం మదిలో నాటుకునే అవకాశాలు లేవు. ఇక బ్యాలెట్ పేపర్ లో అక్షర క్రమంలో అభ్యర్ధుల పేర్లు ఉంటాయి. చిరంజీవి అసలు పేరు కొణిదెల శివశంకర వర ప్రసాద్. బ్రాకెట్లో ఎవరైనా నిక్ నేమ్ పెట్టుకోవచ్చు.
కాబట్టి అంత పొడుగు పేరు తర్వాత చిరంజీవి పేరును బ్రాకెట్లో పెట్టుకోవచ్చు. ఈ లొసుగును ఆసరాగా తీసుకుని ఆయన ప్రత్యర్ధులు శివ ప్రసాద్, శివశంకర ప్రసాద్ అనే పేర్లు గల వారికోసం గాలిస్తున్నారు. ఆ పేరు గల వ్యక్తి లభిస్తే అతనికి కొంత డబ్బు ఇచ్చి ఇండిపెండెంట్ గా నిలబెట్టాలనుకుంటున్నారు. బ్రాకెట్లో ఎటూ చిరంజీవి అని పెట్టుకోవచ్చు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ అయినా, మామూలు ఓటింగ్ అయినా అయోమయం కలుగక మానదు. ఈ అయోమయం ద్వారా చిరంజీవి ఓట్లకు గండి కొట్టాలన్న ప్రయత్నం జరుగుతోంది.












Click it and Unblock the Notifications