చిరు ఆదాయపు పన్ను గుట్టు!

కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె సూర్యప్రకాశరావు సమాచార హక్కు చట్టం కింద చిరంజీవి ఆదాయపు పన్ను వివరాలను కోరారు. చిరంజీవి హైదరాబాద్ కు మకాం మార్చి పదిహేనేళ్ళు అయినా ఆయన ఇప్పటికీ చెన్నైలోనే ఇన్ కంటాక్స్ రిటర్న్ లను దాఖలు చేస్తున్నారు. ఎవరైనా ఒక వ్యక్తికి సంబంధించిన సమాచారాన్ని ఆ వ్యక్తి ఆమోదం పొందకుండా వెల్లడించకూడదన్న నిబంధన ఉండడంతో ఆదాయపు పన్ను శాఖ చిరంజీవికి లేఖ రాయవలసి వచ్చింది.
చిరంజీవి అక్టోబర్ 15 వ తేదీన విశాఖపట్నంలో మాట్లాడుతూ తన ఆదాయపు పన్ను, ఖర్చులు, ఇతర ఆర్ధిక లావాదేవీలు ఖచ్చితంగా ఉన్నాయని, ఎవరైనా ఆ వివరాలు తెలుసుకోవచ్చని చేసిన ప్రకటనను గోనె సూర్యప్రకాశరావు తన దరఖాస్తులో ప్రస్తావించారు. ఆ మాటకు చిరంజీవి కట్టుబడి ఉంటారా అని ఆయన ప్రశ్నించారు. రాజకీయాల్లో ఎంత వేడి ఉంటుందో చిరంజీవికి ఇప్పటికే తెలిసి ఉండాలి.












Click it and Unblock the Notifications