సమాచారమంత్రి పోసాని?

తాను ముఖ్యమంత్రి అయితే ఇతర శాఖలు ఎవరికి కేటాయించాలో కూడా చిరు కసరత్తు చేస్తున్నట్టు చెబుతున్నారు. దీనిని కొందరు జోక్ గా కొట్టిపారేయవచ్చు. తనను గట్టిగా సమర్ధిస్తూ, తనను విమర్శించిన వారిపై మాటల దాడి చేస్తున్న పోసాని కృష్ణ మురళిని సమాచార శాఖ మంత్రిగా నియమించుకోవాలన్నది చిరు కోరిక అంటున్నారు. "పీఅర్పీ కాపు పార్టీ అని ఎలా విమర్శిస్తారు? నేను కమ్మవాడిని. సిసిలైన కమ్మవాడిని. నాకు ఆయన టికెట్ ఇవ్వలేదా? అని పోసాని ఒక టీవీ చానల్ చర్చలో ఘాటుగా మాట్లాడారు. అది చిరంజీవికి మహదానందం కలిగించింది. కోటగిరి విద్యాధరరావుకు ఆర్ధిక, వంగా గీతకు గనుల శాఖను ఇచ్చే అవకాశముంది. తమ్మినేని సీతారాం కు హోం శాఖ, వంగవీటి రాధాకు రవాణాశాఖ దక్కవచ్చు. ఇవన్నీ తూర్పు గోదావరి జిల్లాల్లో బెట్టింగులు కాస్తున్న వారి నుంచి వివిధ మీడియాల్లో వస్తున్న సమాచారంలోని అంశాలు.












Click it and Unblock the Notifications