దాసరికి కోపం తెప్పించిన ఆమె!

ఇటీవల ఒక సినిమా ఫంక్షన్ లో ఇలియానా ఆయనను విష్ చేసిన తీరు ఆయనకు ఆగ్రహం తెప్పించిందట. పరభాషా హీరోయిన్లు అయినా గతంలో తెలుగు తరహా వినయాన్ని నేర్చుకుని మసలుకునేవారు. ఇలియానా వంటి వారికి ఆ వినయం వంటబట్టడం లేదు. దానితో కోపమొచ్చిన దాసరి ఆ ఫంక్షన్ నుంచి మధ్యలోనే నిష్కృమించారట. ఇలియానా మాత్రం తనను తాను సమర్ధించుకుంటోంది. తనకు వచ్చిన భాష, సంభోదన అదేనని, తానేమీ చేయలేనని అంటోంది. దాసరి సినిమా రంగంలోనే గాక రాష్ట్ర రాజకీయాల్లో కూడా ప్రముఖ వ్యక్తి. ఆయనంటే ముఖ్యమంత్రి వైఎస్ కు కూడా గౌరవం. ఇలియానా వంటి వారికి తెలుగు పెద్దలను ఎలా గౌరవంగా సంబోధించాలో కౌన్సిలింగ్ ఇస్తే బాగుంటుందేమో.












Click it and Unblock the Notifications