రాహుల్ గాంధీ ఫార్ములా బెడిసికొట్టిందా?

తెలంగాణపై ఇంత హడావుడిగా ప్రకటన వెలువడడానికి "బాల మేధావి" రాహుల్ గాంధీయే కారణమని చెబుతున్నారు. ఉత్తర ప్రదేశ్ ను మళ్ళీ విభజించి అక్కడ కాంగ్రెస్ పాగా వేయడానికి వ్యూహం రచించిన రాహుల్ ఆంధ్ర ప్రదేశ్ లోనూ ఆ ఫార్ములా కాంగ్రెస్ కు మంచిదని సూచించినట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయినా రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెసే అధికారంలో ఉంటుందని గట్టి అభిప్రాయానికి వచ్చిన తర్వాతే కేంద్రం తెలంగాణపై ప్రకటన చేసింది.
కోస్తా, రాయలసీమ ఆందోళనలు, ఎమ్మెల్యేల రాజీనామాలతో రాహుల్ పథకం బెడిసికొట్టింది. పిల్లకాకి కేం తెలుసు ఉండేలు దెబ్బ అన్న సామెత రాహుల్ కు చక్కగా వర్తించింది. నలబై ఏళ్ళ వయసు వచ్చినా పెళ్ళి చేసుకోకుండా ఈ దేశం కోసం ఎన్నో చేయాలనుందని, ఆ తర్వాతే పెళ్ళని రాహుల ఈ మధ్య చెప్పుకున్నాడు. రాహుల్ హయాంలో ఇంకా ఎన్ని ప్రయోగాలు జరుగనున్నాయో, ఎన్ని ఉపద్రవాలు జరుగనున్నాయో! మధుయాష్కి వంటి వారు రాహుల్ గాంధీని తెలంగాణకు అనుకూలంగా ప్రభావితం చేసినట్టు చెబుతున్నారు.
రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్ధితుల్లో కాంగ్రెస్ కాకుండా మరో పార్టీ అధికారంలో ఉండి ఉంటే రాష్ట్రపతి పాలన వచ్చి ఉండేది. ప్రాంతీయ వాదాల గురించి పెద్దగా తెలియని సోనియా గాంధీ కారు ఎక్కి డ్రైవింగ్ సీటులో కూర్చుని స్టార్ట్ చేసిన తర్వాత డ్రైవింగ్ నేర్చుకుంటున్నట్టుగా ఉంది ఈ పరిస్ధితి. శాంతి భద్రతల పరిస్ధితి చేయి దాటిపోతే, అమాయకులు బలైపోతే ఎవరిని నిందించాలి? రాహుల్ నా? సోనియానా? ఉత్సవ విగ్రహమైన మన్మోహన్ సింగ్ నా? తమిళనాడులో కూడా వేర్పాటు ఉద్యమం పుట్టిన నేపధ్యంలో చిదంబరాన్నా?












Click it and Unblock the Notifications