గవర్నర్ నరసింహన్ చిదంబరం మనిషి!

నిజానికి ఆయన సెక్స్ కుంభకోణంలో తెరవెనుక పాత్ర వహించిన ఆ కాంట్రాక్టర్ మహిళ తెలంగాణకు చెందిన వారు కాదు. ఆ క్లిప్స్ ను ధైర్యంగా ప్రచురించిన ఆంధ్రజ్యోతి చానల్ కూడా తెలంగాణ యాజమాన్యం లోనిది కాదు. పోనీ తమకు వ్యతిరేకమైన గవర్నర్ ను సాగనంపి, తమకు పూర్తిగా అనుకూలుడైన గవర్నర్ ను తెలంగాణ నాయకులు తెచ్చుకున్నారా అంటే అదికూడా కాదు. కొత్త నరసింహన్ నరహంతకుడని, తెలంగాణలో రక్తపాతం సృష్టించడానికే ఆయనను రప్పించారని మావోయిస్టు నాయకులు ఆరోపిస్తున్నారు. గవర్నర్ నియంతగా వ్యవహరించబోతున్నారన్న భయభ్రాంతులు వ్యక్తమవుతున్నాయి. నరసింహన్ హోంమంత్రి చిదంబరం మనిషి. ఆయన లాబీయింగ్ వల్లనే నరసింహన్ మొదటిసారిగా గవర్నర్ అయ్యారు. చిదంబరం బాస్ ఏది చెబితే అలా వ్యహరించడానికి నరసింహన్ సిద్ధంగా ఉన్నట్టు కన్పిస్తోంది.












Click it and Unblock the Notifications