హరికృష్ణ దూరం?

అయితే, కేంద్ర మంత్రి, కాంగ్రెస్ లోకసభ అభ్యర్థి, తమ సోదరి పురంధేశ్వరిపై తెలుగుదేశం నాయకులు తీవ్రంగా ధ్వజమెత్తుతున్నారు. పురంధేశ్వరి, దగ్గుబాటి దంపతులతో తెలుగుదేశం నాయకులు వివాదానికి దిగుతున్నారు. పురంధేశ్వరిపై ఎంతో గౌరవం ఉన్న హరికృష్ణకు అది నచ్చడం లేదని అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ రంగప్రవేశానికి ముందు ప్రజల్లోకి వెళ్లి హడావిడి చేసిన నందమూరి హీరోలు కళ్యాణ్ రామ్, తారకరత్నల చడీచప్పుడు లేదు. జూనియర్ ఎన్టీఆర్ వల్లనే వారు దూరంగా ఉంటున్నారా అనే సందేహం కూడా వ్యక్తమవుతోంది. మొత్తం మీది స్వర్గీయ ఎన్టీఆర్ కుటుంబంలో కలతలు తీవ్రంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications