చిరు చేతులెత్తేస్తారా?

Chiranjeevi
ప్రజారాజ్యం పార్టీని మరో ఐదేళ్ళ పాటు నడపడం వృధా ప్రయాస అని చిరంజీవి అనుకుంటున్నారా? రాజకీయాలు అనవసరమని అల్లు అరవింద్ కూడా భావిస్తున్నారా? ముందు కెళ్ళని "అబు" సినిమాలాగా వాళ్ళకి ఇప్పుడు ప్రజారాజ్యం కనిపిస్తోంది. చిరంజీవితో కలిపి ఉన్నది 18 మంది ఎమ్మెల్యేలు. అందులో పది మంది కాంగ్రెస్ లోకి జంప్ చేయడానికి రంగం సిద్ధమైంది. కానీ వైఎస్ వాళ్ళని తాత్కాలికంగా అక్కడే ఉండమని, పిలిచినప్పుడు రమ్మని చెప్పినట్టు తెలుస్తోంది. ఆ పది మంది ఇష్టం లేని కాపురంలాగా ప్రజారాజ్యంలో కొనసాగుతున్నారు.

ఇక చిరంజీవి పార్టీ రెండో కార్యాలయం సంగతి. ఇది అన్నపూర్ణ స్టూడియోస్ ఏడెకరాలను ఆనుకుని ఉంది. ఇది తోట చంద్రశేఖర్ అనే ఐఎఎస్ ఆఫీసర్ ఇచ్చినది. మొన్న ఎన్నికల్లో ఓడిపోయిన చంద్రశేఖర్ తన బిల్డింగ్ నుంచి పార్టీ ఆఫీసును ఖాళీ చేయించాల్సిందిగా చిరంజీవిని కోరారు. చిరంజీవికి అది ఇంటర్వెల్ కు ముందు టిస్ట్ లా అన్పించి ఉండవచ్చు. కానీ చేదు నిజం. అప్పటి నుంచి చిరంజీవి మొహంలో కళ లేకుండా పోయింది. ఎన్నికల గుర్తు సరిగా లేకపోవడం, పార్టీని నిర్మించడానికి సమయం సరిపోకపోవడం, మీడియా సహకరించకపోవడం వల్లనే తాను సిఎం కాలేకపోయానని చిరంజీవి అనుకోవచ్చు. కానీ అంతకంటే పెద్ద కారణాలే ఆయన రాజకీయ పతనానికి దారి తీశాయి. అనుకున్నట్టుగా కాపు, తెలగ, బలిజ, మున్నూరు కాపు, తూర్పు కాపు ఓట్లు ఆయన పార్టీకి పెద్దగా పడలేదు. ఆ ఓట్లలో అధిక భాగం రాజశేఖరరెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ కే వెళ్ళిపోయాయి. చిరంజీవి అభిమానులు కూడా చిత్తశుద్ధితో పని చేయలేదు. ఆయన మాకు సినిమాల్లో అభిమాని కానీ రాజకీయాల్లో కాదు కదా అన్నట్టు వారు వ్యవహరించినట్టు కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+