సోనియా గాంధీకి కోస్తా, రాయలసీమ షాక్

సామాజికంగా, ఆర్ధికంగా తెలంగాణ వెనుకబడిన మాట వాస్తవమే. కానీ సరైన సమయంలో కాకుండా సోనియాగాంధీ తెలంగాణ డిమాండ్ కు తలొగ్గారన్న విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణ తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెడతారా లేదా అన్నది ప్రశ్నార్ధకమైంది. ఇప్పటికే వందమందికి పైగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తెలంగాణకు వ్యతిరేకంగా రాజీనామాలు సమర్పించారు. కోస్తా ఆంధ్ర, రాయలసీమలకు చెందిన ఎమ్మెల్యేలు ఎంపీలపై రాజీనామాలు చేయవలసిందిగా ఆయా ప్రాంతీయ ప్రజా సంఘాలు, మేధావులు ఆందోళనను తీవ్ర తరం చేస్తున్నారు. రేపు విజయవాడ, విశాఖపట్నం, రాయలసీమ బంద్ కు సన్నాహాలు జరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications