జీవిత ఓవరాక్షన్

జగన్ మాత్రం చిరునవ్వు చిందించారు కానీ ఏమీ మాట్లాడలేదు. ఆమె ఈవిధంగా మాట్లాడినప్పుడు భర్త రాజశేఖర్ పక్కనే ఉన్నారు. ఆయన అయ్యప్ప మాల వేసి ఉన్నారు. భర్త మాల వేసి ఉండగా భార్య ఇలా రెచ్చగొట్టే రాజకీయ వ్యాఖ్యలు చేయవచ్చా అని అక్కడున్న వారు ముక్కున వేలేసుకున్నారు. వచ్చీ రాని తెలుగులో తతత్త అనే రాజశేఖర్ కామ్ ఉండిపోయి ఆ అయ్యప్పస్వామి పరువును కాపాడారు.
ఈ సమయంలో జగన్ ఇలా ఉండడమే మంచిదని ఆయన శ్రేయోభిలాషులు అంటూ ఉండగా జీవిత, జయసుధ వంటి వారు పిచ్చి పిచ్చిగా రెచ్చగొట్టడంపై క్యాంపు కార్యాలయం బయట చర్చలు జరుగుతున్నాయి. జగన్ కు ఇప్పట్లో అపాయింట్ మెంట్ ఇవ్వడానికి సోనియా నిరాకరించారన్న ప్రచారం ఊపందుకుంది. దీనితో మరెంతో కాలం జగన్ ఈ టెంపోను మెయింటైన్ చేయలేరని అంటున్నారు.












Click it and Unblock the Notifications