'జ్యోతి'కి జూనియర్ తో ఏం పని?

జూనియర్ ఎన్టీఆర్ తాను తెలంగాణలో పుట్టి పెరిగానని, ఈ ప్రాంతంలో ప్రచారం చేయాలనుకున్న సమయానికి యాక్సిడెంట్ జరిగిందని రాధాకృష్ణకు ఇచ్చిన "ప్రత్యేక" ఇంటర్వ్యూలో బాధ పడ్డారు. రాధాకృష్ణ కూడా తాను తెలంగాణలోనే పుట్టి పెరిగానని తన ఆత్మకథలో రాసుకున్నారు. ఎవరు ఎక్కడ పుట్టారన్నది కాదు, సమాజానికి ఏం చేస్తున్నారన్నది ప్రధానం.
సెటిలర్ల గురించి నానా రకాలుగా మాట్లాడే వారు ఈ విషయాన్ని నిగూఢంగా ఆలోచించాలి. తన సినిమా కెరీర్ ను పణంగా పెట్టుకుని ఎండల్లో తిరిగి ప్రచారం చేసి తన మాట నిలబెట్టుకుని ఎన్టీఆర్ త్రికరణ శుద్ధిగా ఉన్నారు. స్వార్ధపర శక్తుల నుంచి ఆయన బయటపడాలంటే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక ఆయన హనుమాన్ చాలీసా చేసుకోవడం మంచిది.












Click it and Unblock the Notifications