జగన్ లింక్స్

అయితే ఆ సంబంధానికి వ్యాపార లావాదేవీలు అంటగడుతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపార సంబంధాలే నాగార్జున ప్రకటనకు కారణమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రిగా జగన్ అర్హుడని చెప్పడానికి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఆయన సమర్థతను ఒక కారణంగా చూపుతుండడం బహిరంగ రహస్యమే. నాగార్జున చాలా కాలం నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగిస్తున్నారని, ఇందులో ఆయన సీనియర్ నటుడు మురళీమోహన్ ను ఆదర్శంగా తీసుకున్నారని, జగన్ తో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించిన సంబంధాలు నాగార్జునకు ఉన్నాయని, అందుకే జగన్ ను ముఖ్యమంత్రి పదవిలో చూడాలని ఆయన కోరుకుంటున్నారని టాలీవుడ్ వర్గాలే కాదు, రాజకీయ వర్గాలు కూడా గుసగుసలాడుతున్నాయి. జగన్ ను ముఖ్యమంత్రి పదవిలో చూడడానికి నాగార్జునకు చాలా కాలమే పట్టేట్లుందని వ్యాఖ్యానిస్తున్నారు.












Click it and Unblock the Notifications