అవి వార్తలా? యాడ్సా?

Ramoji Rao
దినపత్రికల్లో ముఖ్యంగా జిల్లా ఎడిషన్లలో మొదటి పేజీలు రాజకీయ పార్టీలకు దారుణంగా అమ్ముడుపోతున్నాయి. నిన్న ఈనాడు సిటీ పేజి, నేడు ఆంధ్రజ్యోతి సిటీ పేజిలో ఆయా అభ్యర్ధులు గెలవబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. అవి అడ్వర్టయిజ్ మెంట్లు అయినా వార్తలుగా ప్రచురించారు. నేరుగా మేనేజ్ మెంట్లకు డబ్బులు ఇచ్చి ఆయా అభ్యర్ధులు ఇలా ప్రచారం చేసుకుంటున్నారు. దీనిపై ఎన్నికల సంఘం ఇంకా నిఘా నేత్రం సారించకపోవడం విమర్శలకు తావిస్తోంది.

ఎన్నికల్లో ధనబలానికి వ్యతిరేకమని చెప్పుకుంటున్న లోక్ సత్తా పార్టీ సంగతి ఇది. ఆ పార్టీ మల్కాజ్ గిరి లోక్ సభ అభ్యర్ధి ఎల్ రత్తయ్య. ఆయన నిన్న ఈనాడు సిటీలో కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి సిటీ మొదటి పేజీలో ఎడ్వర్టోరియల్ రాయించుకున్నారు. మల్కాజ్ గిరిలో రత్తయ్యదే హవా అన్నట్టు న్యూస్ లాగా రాయించుకున్నారు. దీని ప్రభావం ఓటర్ల మీద ఎంత వరకు ఉంటుందో తెలియదు కానీ జర్నలిజం కలుషితమైపోయిందన్నది వాస్తవం. టీవీ చానళ్ళ లాగానే వార్తాపత్రికల యాజమాన్యాలు కూడా డబ్బు కోసం ఎంతకైనా తెగబడుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+