దడ పుట్టిస్తున్న ఎన్టీఆర్

చిరంజీవి కంటే పవన్ కల్యాణ్ సూటిగా మాట్లాడుతున్నారు. బాలకృష్ణ కంటే ఎన్టీఆర్ పదునుగా మాట్లాడుతున్నారు. ఎన్టీఆర్ ప్రసంగాలను టీవీలలో నిశితంగా చూసిన చిరంజీవి నేటి తన కృష్ణాజిల్లా రోడ్ షోలలో తన స్టైల్ లో కొద్ది మార్పులు చేసుకున్నారు. తన ప్రసంగం స్పీడ్ గా ఉండేలా చూసుకుంటున్నారు. అదే విధంగా స్పీచ్ లో పదునైన మాటలు వాడుతున్నారు. మరో నెలరోజుల్లో జూనియర్ మరింతగా ప్రసంగాల్లో పండిపోయే అవకాశముంది. సినిమా నటులు ఎవరి శైలిలో వారు కొద్దిగా మార్పులు చేసుకుంటూ ముందుకు సాగిపోతున్నారు.
తనకు ఎవరూ స్క్రిప్టు రాసివ్వడం లేదని, ఆయా సమస్యల మీద తాను అవగాహన పెంచుకున్నానని ఎన్టీఆర్ చెబుతున్నారు. తాను కార్యకర్తను మాత్రమేనని, తాను రాజకీయ నాయకుడిని కానని జూనియర్ మీడియాకు వినయంగా చెబుతున్నాడు. ఈ నెల రోజులు ప్రచారం చేసిన తర్వాత తన బతుకు తెరువు అంటే సినిమా నటన మీద దృష్టి కేంద్రీకరిస్తానని ఆయన చెప్పారు. జూనియర్ రోడ్ షోలకు వస్తున్న జనాన్ని చూసి మరో వైపు చంద్రబాబు నాయుడు ఉబ్బి తబ్బిబ్బు అవుతున్నారు.












Click it and Unblock the Notifications