జయప్రద రాం'పూర్'

Jayaprada
ఉత్తర ప్రదేశ్ లోని రాంపూర్ లోకసభ నియోజకవర్గంలో సినీ నటి, స్థానిక లోకసభ సభ్యురాలు జయప్రదకు కష్టాలు వచ్చి పడ్డాయి. సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గత ఎన్నికల్లో గెలిచిన జయప్రదకు ఈ ఎన్నికల్లో తిరుగుబాటు సమస్య ఎదురవుతోంది. స్థానిక ఎస్పీ నాయకుడు ఆజం ఖాన్ జయప్రదకు మళ్లీ టిక్కెట్ ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయనకు ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ అండదండలు కూడా ఉన్నట్లు సమాచారం. ఆజం ఖాన్ రాంపూర్ సీటును ఆశిస్తున్నారు. జయప్రదకు వేరే చోట సీటు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. అయితే జయప్రదకు ఎస్పీ ప్రధాన కార్యదర్శి అమర్ సింగ్ అండదండలు పుష్కలంగా ఉన్నాయి. దాంతో సీటుకు ఢోకా లేదు గానీ విజయానికే ఢోకా వచ్చేట్లు ఉందని అంటున్నారు. పూర్ జయప్రద.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+