రాఖీ సావంత్ పెళ్లి 'షో'

మానవ్ కు కేవలం 23 ఏళ్ల వయస్సేనని, అయితే చాలా మాచ్యూర్ అని, తాను మరో అభిషేక్ అవస్థీని కాదలుచుకోలేదని అతనంటున్నాడని, తాను స్వతంత్రంగా జీవించాలని అనుకుంటున్నట్లు చెప్పాడని, పేరు సంపాదించుకోవాలని అనుకుంటున్నట్లు, దానికి కొంత సమయం పట్టనున్నట్లు అతను చెబుతున్నాడని రాఖీ అంటోంది. ఎలేష్ కూడా ముంబైలో స్థిరపడాలని అనుకుంటున్నట్లు ఆమె తెలిపింది. చిటిజ్ తనను ప్రేమించడం లేదని చెప్పాడని అంటోంది. ఈ విధంగా ఏదో ఒక కారణం చెప్పి ఆమె పెళ్లిని కాదనే పరిస్థితిని సృష్టిస్తోంది. ఈ రకంగా టీవీ రియాల్టీ షో మరింత కాలం కొనసాగుతుందా. రాఖీ సావంత్ డ్రామా అందులో భాగమేనా. కావచ్చు.












Click it and Unblock the Notifications