రోజా అప్పుడే ట్రై చేసిందా?
కాంగ్రెస్ లో చేరడానికి తెలుగు మహిళ అధ్యక్షురాలు ఉత్సాహం చూపుతున్నారని వైఎస్ స్వయంగా మీడియాకు చెప్పినప్పటి నుంచి ఉభయ పార్టీల్లో ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. గత ఎన్నికల ముందు రోజాకు టికెట్ ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు తటపటాయించి చివరికి ఇచ్చారు. ఈలోపు రోజా కాంగ్రెస్ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించినట్టు తెలుస్తోంది. రోజా కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నించిన విషయాన్ని కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకులు దృవీకరించారు. ఆమె టిటిడీ మాజీ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి వద్దకు తన బంధువులను పంపించి కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నించారట. కరుణాకర్ రెడ్డితో ఆమె జరిపిన ఫోన్ సంభాషణను రికార్డు చేసినట్టు సిఎల్పీ నాయకులు చెబుతున్నారు. దానిని చంద్రబాబు నాయుడు ధృవీకరించుకుంటే, తెలుగుమహిళ అధ్యక్ష పదవి నుంచి రోజాను తప్పించడం ఖాయమని తెలుగుదేశం నాయకులు అంటున్నారు. రెడ్డి కులస్ధురాలైన రోజాను కాంగ్రెస్ లోకి చేర్పించుకుని ఆమెకు మహిళా కమిషన్ అధ్యక్ష పదవి కట్టబెట్టడానికి ముఖ్యమంత్రి వైఎస్ సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. కాకపోతే ఆయన రోజా ద్వారా చంద్రబాబు నాయుడిని కొంతకాలం వేధించదలుచుకున్న ట్టు కన్పిస్తోంది.












Click it and Unblock the Notifications