సాక్షి చానల్ లో ఎన్టీఆర్ బాధలు

జూనియర్ నుంచి కాంగ్రెస్ కు ముప్పు పొంచి ఉండడంతో వైఎస్ సొంత చానల్ సాక్షిలో జూనియర్ మీద దాడి ప్రారంభమైంది. జెమిని టీవీలో రమ్యకృష్ణ నిర్వహించిన ఒక ప్రోగ్రాంకు హాజరైన జూనియర్ ఎన్టీఆర్ తన మనసులోని మాటలను బయట పెట్టారు. తనకు, తన తల్లికి నందమూరి కుటుంబం తగిన గౌరవం ఇవ్వడం లేదని, అనేక అవమానాలు పడ్డామని చెప్పుకొచ్చాడు. ఆ రీల్ ను సాక్షి పట్టుకుని ప్రసారం చేస్తోంది. టీవీ-9 కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా జూనియర్ అదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. సాక్షి చానల్ జర్నలిస్టులు తమ స్వామి భక్తిని చాటుకోడానికి ఇది మంచి అవకాశం.












Click it and Unblock the Notifications