రామోజీకి చేరువైన సుమన్!

Ramoji Rao
రామోజీరావుకు పుత్రోత్సాహం కలిగించకపోగా ఎంతో బాధను రగిల్చిన ఆయన చిన్న కుమారుడు సుమన్ కు ఇప్పుడు లోకమంటే ఏమిటో తెలిసివచ్చినట్టయింది. వందిమాగధుల పొగడ్తలతో నేల విడిచి సాము చేసిన అతనికి గోరు ముద్దల విలువ, తలిదండ్రుల హృదయ స్పందన ఏమిటో అర్ధమయినట్టుంది. తన సహచరుడు ఈటీవీ ప్రభాకర్ తో కలిసి సుమన్ సాక్షి పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో తన తండ్రిని ఆయన నానా దుర్భాషలాడారు. అయినా రామోజీరావు చలించకుండా రెండో కొడుకుని అలాగే దూరంగా ఉంచారు.

తల్లి రమాదేవి రాయబారంతో సుమన్ ఇప్పుడు తండ్రికి దగ్గరై, జరిగిన సంఘటనలకు క్షమాపణలు చెప్పుకున్నట్టు తెలుస్తోంది. తాను బాగా వెలిగినప్పుడు తన తోక పట్టుకు తిరిగిన ప్రభాకర్ ఇప్పుడు లోకల్ టీవీలో కొత్త వేషాలు వేసుకుంటున్నాడు. సుమన్ రమ్మని పిలిచినా బిజీగా ఉన్నానంటూ తప్పించుకుంటున్నాడట. పాత తెలుగు సినిమాల్లో జమీందారులు కుమారులు మధ్యలో దారి తప్పి చివర్లో తనవారితో కలిసినట్టు సుమన్-రామోజీల బంధం సుఖాంతం అయినట్టేనని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+