చిరుపై రోజా కోపానికి కారణమిదా?

బాలీవుడ్ భామల్లా తెల్లగా ఉండకుండా రోజా నల్లగా ఉండడం చిరంజీవికి నచ్చలేదట. అందువల్లనే ఆనాడు కొందరు నిర్మాతలు, దర్శకులు సూచించినా చిరంజీవి రోజాను హీరోయిన్ గా అంగీకరించలేదని తెలుస్తోంది. అప్పటి నుంచి చిరంజీవి పై ఆమె వ్యక్తిగత ద్వేషం పెంచుకుంది. ఘటోత్కచుడు వంటి సినిమాల్లో అలీ వంటి వారి పక్కన హీరోయిన్ గా చేసిన రోజాతో తాను నటించడమేమిటని చిరంజీవి చెప్పేసరికి నిర్మాతలు నమ్రతగా బాలీవుడ్ హీరోయిన్ల వేటలో పడేవారు. తన కెరియర్ కు ఇంత ద్రోహం చేసిన చిరంజీవిపై రాజకీయంగా అయినా ప్రతీకారం తీసుకునే ఉద్దేశంతో రోజా దాదాపు తొడ గొట్టినంతగా చిరు బ్రదర్స్ పై విమర్శలు చేసింది. చిరంజీవి వల్ల ఎంతమంది హీరోయిన్లు ఎన్ని రకాలుగా ఇబ్బంది పడ్డారో ఆమె చిట్టా బయట పెడతాననే సరికి ఈ వివాదానికి తెరపడింది.












Click it and Unblock the Notifications