చిరంజీవి పరువు తీస్తున్నారా?

కొన్ని రంగాల్లో తాను విఫలమవుతున్నానన్న అభిప్రాయం ఉండబట్టే చిరంజీవి తన సోదరుడు పవన్ కల్యాణ్ కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి కొన్ని జిల్లాల్లో తిరగమని చెప్పినట్టు తెలుస్తోంది. కరీంనగర్ జిల్లాలో ప్రస్తుతం పర్యటిస్తున్న పవన్ తన పదునైన వ్యాఖ్యలతో కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుల గుండెల్లో రైళ్ళు పరుగెత్తిస్తున్నారు. పవన్ కల్యాణ్ కు ఇంతటి రాజకీయ నాలెడ్జి ఉంటుందని ఊహించని తెలంగాణ సామాన్యులు ముక్కున వేలేసుకుంటున్నారు.
చిరంజీవికి రాజకీయాలు ఒక కర్తవ్యం మాత్రమేనని, కాంగ్రెస్ వారికి రాజకీయాలంటే వ్యాపారమని పవన్ కల్యాణ్ కరీంనగర్ జిల్లా సభల్లో చెబుతున్నారు. పవన్ కల్యాణ్ మాటలు తెలంగాణలో తూటాల్లా పేలుతున్నాయి.












Click it and Unblock the Notifications