జెపితో బాబు పేచీకి కారణం?

మార్పు తేవడానికే లోక్ సత్తా ఆవిర్భవించిందని చెప్పుకుంటూ చంద్రబాబుతో చేతులు కలిపితే అపహాస్యం పాలవుతామని జెపి భావించారు. లోక్ సత్తా క్రమంగా బలపడడం, చాలా నియోజకవర్గాల్లో ఆ పార్టీకి గట్టి పునాదులు పడడం చంద్రబాబుకు కంటగింపుగా ఉందట. అందుకే ఆయన లోక్ సత్తా కాంగ్రెస్ తో కుమ్మక్కయిందని, కోట్లాది రూపాయల డబ్బు తీసుకుందని ఆరోపించారు. దీనిపై తీవ్రంగా స్పందించవలసిందిగా తమ నాయకులను జెపి ఆదేశించారు. వచ్చే ఎన్నికల నాటికి తెలుగుదేశం బాగా క్షీణించిపోయి లోక్ సత్తా ప్రజారాజ్యం బాగా పుంజుకుంటాయని ఒక అంచనా.












Click it and Unblock the Notifications