సబితకు హోం సబబా?

Sabitha Indra Reddy
సబితా ఇంద్రారెడ్డికి హోం మంత్రి పదవి ఇవ్వడం ద్వారా వైఎస్ తన తెగువను, తెలివిని చాటుకున్నారు. ఒకరకంగా ఆయన వెనుకనుంచి హోంశాఖను స్వయంగా నిర్వహిస్తున్నట్టే లెక్క. ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమైన పదవి హోంశాఖే. దానిని పురుషపుంగవులకు ఇస్తే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టే. సిఎంను మార్చాలనుకున్నప్పుడు హై కమాండ్ దృష్టి మొదట హోం మంత్రి మీదే పడుతుంది. అయితే వైఎస్ కు హై కమాండ్ నుంచి అటువంటి సమస్య్ ఇప్పట్లో తలెత్తదు. ఎందుకైనా మంచిదని ఆయన చేవెళ్ళ చెల్లెమ్మను హోంశాఖకు తెచ్చుకున్నారు.

హోం మంత్రిగా జానారెడ్డి పెద్దగా రాణించలేదు. ఆయనతో పెద్ద ప్రమాదం లేకపోయినా ఆయన పూర్తిగా తెలంగాణ వాది కావడమే వైఎస్ కు ఇబ్బంది కలిగించిన అంశం. సబితతో ఆయనకు అటువంటి సమస్య లేదు. హోంమంత్రి పదవిని తెలంగాణ ప్రాంతానికి ఇవ్వకతప్పని పరిస్ధితుల్లో ఆయన ఒక మహిళకు ఆ పదవిని ఇచ్చి సేఫ్ గేం ఆడారు. ఈ విధంగా చేయడం ద్వారా ఆయన మహిళల ఆదరణను మరింతగా చూరగొన్నారు. మంత్రులందరూ తన వీర విధేయులు కావడంతో రాజశేఖరరెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాకుండా రాజాధిరాజు అయ్యారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+