చిరుతో జెపి కలుస్తారా?

Jayaprakash Narayan
లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ మీద తెలుగుదేశం పార్టీ అసహనం రోజు రోజుకీ పెరుగుతోంది. చంద్రబాబు నాయుడు సీనియర్ టిడిపి నాయకులతో ఈ విషయం మీద రోజూ చర్చిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెలుగుదేశం ఓట్లను లోక్ సత్తా గణనీయంగా చీల్చుకోగలదని ఒక అంచనా. అది కాంగ్రెస్ కు లాభిస్తుందని చంద్రబాబు నాయుడు భయం. ఇక ప్రజారాజ్యం వల్ల కూడా కాంగ్రెస్ కే లాభం చేకూరుతుందని తెలుగుదేశం మేధావుల అంచనా. ఈసారి టీఅర్ ఎస్ ను వదిలేసి కమ్యూనిస్టులు, ప్రజారాజ్యం, లోక్ సత్తాలతో మరో మహా కూటమిని ఏర్పాటు చేయాలన్న ఆలోచన చంద్రబాబు నాయుడికి ఉన్నా లోక్ సత్తా, పీఅర్పీ లు టిడిపితో కలవడాఅనికి సిద్ధంగా ఉన్నట్టు కన్పించడం లేదు. టిడిపి లేకుండా లోక్ సత్తా, ప్రజారాజ్యం పార్టీలు కలిసి పోటీ చేస్తే మెరుగైన ఫలితం ఉండవచ్చు.

లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ మీద కమ్మ కులంలో వ్యతిరేకత బలపడుతోంది. గెలిచే సత్తా లేకపోయినా ఆ పార్టీ ఓట్లు చీల్చుకోవడం వల్ల తెలుగుదేశం పార్టీకి నష్టం జరుగుతోందని వీరి వాదన. జయప్రకాష్ నారాయణ ప్రసంగాల్లో సత్తా ఉండడం లేదని, అవి మంత్రాల్లాగా ఉండి సామాన్య జనానికి ఏమీ అర్ధం కావడం లేదని ఒక విమర్శ. జెపి ప్రసంగాల్లో నాటు సామెతలు, పంచ్ లు ఉంటే సామాన్య జనాన్ని ఆకట్టుకోగలరని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+