'సాక్షి' సందడి

జీతాల సొమ్ములను చూసి మురిసిపోవడం తప్ప అక్కడ ఏమీ లేదనేవారు కూడా ఉన్నారు. ఆ పత్రికలో ఉద్యోగాల కోసం ప్రయత్నించి భంగపడినవారే ఆ మాటలు అంటుండవచ్చు గానీ అందులో పిసరంతైనా నిజం ఉంటందనే వారు కూడా ఉన్నారు. ఇప్పటి వరకు ఎబిసి రాకపోవడం జగన్ ను కలవరపెడుతున్నట్లు చెబుతున్నారు. సాక్షి పత్రికపై ఇలాంటి దుమారం రావడం ఇదే మొదటిసారి కాకపోయినప్పటికీ ఇది ఈసారి మీడియా వర్గాల్లో పెద్ద యెత్తున ప్రచారంలో ఉంది. చాలా టీవీ చానెళ్లలో బయటకు చెప్పకపోయినప్పటికీ పెద్ద యెత్తున జీతాల్లో కోత విధించారట. అటువంటి కోతే సాక్షిలో కూడా అమలైనా ఆశ్చర్యం లేదని అనేవాళ్లున్నారు.












Click it and Unblock the Notifications