వైయస్ భార్య విజయలక్ష్మికి మంత్రి పదవి?

గతంలో వైయస్ తో పొసగక పదవులకు దూరంగా ఉండిపోయిన వారంతా ఇప్పుడు రంగంలోకి దిగారు. మొత్తం మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేయాలని, సమర్ధతకు, విధేయతకు రోశయ్య పెద్ద పీట వేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న మంత్రులందరి చేతా రాజీనామాలు చేయించాలని కూడా రోశయ్యకు వారు సూచిస్తున్నారు. 'మంత్రి వర్గంలో లేని బయట వ్యక్తులకు విధేయత ప్రకటిస్తున్న వారిని' తొలగించాలని కూడా వారు కోరుతున్నారు.
అయితే ప్రస్తుత మంత్రి వర్గంలో ఎవరినీ తప్పించరారదని కడప ఎంపీ జగన్, కేవీపీల నుంచి కూడా రోశయ్యకు వత్తిడి పెరిగింది. మొన్న సిఎల్పీ సమావేశానికి వచ్చిన కేంద్ర మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, వీరప్పమొయిలీ కూడా రోశయ్యకు, డి శ్రీనివాస్ తో పాటు జగన్, కేవీపీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన నేపధ్యంలో పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఉత్కంఠ కలిగించే అంశమే. ప్రస్తుత మంత్రివర్గంలో మార్పులు చేయరాదని జగన్ డిమాండ్ చేసినప్పుడు కేంద్రమంత్రులు జోక్యం చేసుకున్నారని, అన్ని పరిస్థితులను పరిశీలించే రోశయ్య నిర్ణయం తీసుకుంటారని చెప్పినట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications