టార్చర్ పెడుతున్నాడంటూ...కన్నీళ్ళతో స్నేహ
రాధా గోపాలం, శ్రీరామదాసు వంటి చిత్రాలతో తెలుగునాట పాపులర్ అయిన స్నేహ తాజాగా కోర్టులో కన్నీళ్ళు పెట్టుకుంది. తనను బెంగుళూరు కి చెందిన ఓ యువకుడు వేధింపులకు గురి చేస్తూన్నారంటూ కేసు పెట్టి కోర్టు దాకా వెళ్ళింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. స్నేహకు 2008లో బెంగళూరుకు చెందిన రాఘవేంద్ర(35) ఎస్.ఎమ్.ఎస్. పంపాడు. అందులో 'నన్ను తప్పకుండా పెళ్ళి చేసుకోవాలి, లేకుంటే నీ కుటుంబాన్నే నాశనం చేస్తాను' అని వుంది. ఈ విషయాన్ని స్నేహ కేంద్ర నేర విభాగ డిప్యూటీ కమీషనర్ కు ఫిర్యాదు చేసింది. పోలీసులు రాఘవెంద్రను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసారు. చెన్నైలోని సైదాపేట కోర్టులో ఈ కేసు విచారణకు వచ్చింది. న్యాయమూర్తి శ్రీరామ్ విచారణ సందర్భంగా స్నేహ మాట్లాడుతూ '2008లో రాఘవేంద్ర అనే వ్యక్తీ 'ఆటోగ్రాఫ్ 2' సినిమా తెరకెక్కించనున్నట్లు మా తండ్రి వద్ద చెప్పాడు. అందుకు ఆయన ఒప్పుకోలేదు. అనంతరం రాఘవేంద్ర నా సెల్ కు 50 మిస్డ్ కాల్స్, 20 ఎస్.ఎమ్.ఎస్ లు పంపాడు. నా సెల్ నెంబర్ మార్చాను. కొత్త నెంబర్ ను కూడా తెలుసుకొని మళ్ళి వేధింపులు మొదలుపెట్టాడు. నిన్ను పెళ్ళిచేసుకుంటా లేకుంటే ముద్దయినా పెట్టుకుంటా. నాతొ సెల్ ఫోన్ లో మాట్లాడకుంటే నీ కుటుంబాన్ని నాశనంచేస్తాను అని చెప్పాడు. ఈ సమస్య వల్ల ఇప్పుడు నా కుటుంబమే కోర్టులో వుందని కన్నీళ్ళుతో చెప్పుకొచ్చింది. కేసును అక్టోబర్ కు వాయిదా వేసారు.












Click it and Unblock the Notifications