గీతా బస్రాతో హోటల్లో బజ్జీ

Harbhajan Singh
భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ తన మాజీ గర్ల్ ఫ్రెండ్, బాలీవుడ్ నటి గీతా బస్రాతో ఓ హోటల్లో ఓ కెమెరామన్ కు పట్టుబడ్డాడు. వీరిద్దరి మధ్య గతంలో ప్రేమాయణం నడిచింది. అయితే, బజ్జీ ఆమెను తన కుటుంబానికి పరిచయం చేశాడు. ఏమైందో గానీ వారిద్దరు విడిపోయారు. మళ్లీ ఇప్పుడు ఓ హోటల్లో వారిద్దరు కలిసి గడిపినట్లు ఓ ఆంగ్ల పత్రిక ప్రముఖంగా ప్రచురించింది. హోటల్లోకి కలిసి ప్రవేశించిన ఆ ఇద్దరిని ఓ ఫొటోగ్రాఫర్ కనిపెట్టాడు. ఫొటోగ్రాఫర్ ను చూసిన గీతా బస్రా బజ్జీని ఎరగనట్లు మరో వైపు వెళ్తున్నట్లు నటించింది. అయితే ఆ ఫొటోగ్రాఫర్ కు ఒకే షాట్ లో ఇద్దరూ దొరికిపోయారు. వారిద్దరు ఒకే కారులో వస్తుండడం గమనించిన ఫొటోగ్రాఫర్ ముందుగానే కెమెరాను సరిచేసుకున్నట్లున్నాడు. ఐదు వన్డేలు, టెస్టు మ్యాచులు అడడానికి దక్షిణాఫ్రికాకు బయలుదేరే ముందు బజ్జీ హ్యాపీగా గడిపేసి, ఆ జ్ఞాపకాలను మూట గట్టుకుని వెళ్లాలని అనుకున్నాడేమో.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+