చంద్రబాబు ' మైసూరాస్త్రం'

అవసరమైతే పార్టీ పగ్గాలు చేపడుతానని చెబుతున్న బాలకృష్ణను కూడా పిలిపించి చంద్రబాబు మందలించినట్టు తెలుస్తోంది. విలేకరులు రెచ్చగొట్టే విధంగా ప్రశ్నించినందువల్లనే తాను అలా అనవలసి వచ్చిందని, తనకు దురుద్దేశాలు లేవని బాలకృష్ణ చెప్పుకున్నట్టు తెలిసింది. రోశయ్య హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం నానాటికీ ప్రజల దృష్టిలో దిగజారుతోందన్న అభిప్రాయం బలపడుతున్న తరుణంలో చంద్రబాబు చాకచక్యంగా చక్రం తిప్పుతున్నారు. వైఎస్ లేని కాంగ్రెస్ ను తాను జయించడం చాలా సులభమన్న ఆత్మ విశ్వాసం ఆయనలో కన్పిస్తోంది.












Click it and Unblock the Notifications