బాలకృష్ణకు బాబు సమస్య!

Balakrishna
హీరో బాలకృష్ణపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు వత్తిడి రోజు రోజుకీ పెరిగిపోతున్నది. అందుకు చక్కటి ఉదాహరణ నిన్న బాలయ్య చేసిన ప్రకటన. అనేకసార్లు కాలం కలిసి వస్తే ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన బాలయ్య నిన్న పూర్తిగా ప్లేటు మార్చి చంద్రబాబు బావగారే ముఖ్యమంత్రి పదవికి అర్హులని ప్రకటించి, ఆడపిల్లను ఇచ్చిన వియ్యంకుడిగా వినయాన్ని చాటుకున్నారు. మనసులో ఉన్నది ఉన్నట్టు మాట్లాడే నైజం గల బాలకృష్ణ డైలాగ్ డెలివరీలో కొంత అస్పష్టత ఉన్నా ఆయన చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేరు.

ఇలా ఉండగా చంద్రబాబు మరోవిధంగా మాట్లాడారు. తన రాజకీయ వారసుడు ఎవరో ప్రజలే నిర్ణయిస్తారని చంద్రబాబు నాయుడు అన్నారు. హృదయం లేనట్టు యాంత్రికంగా ఉండే చంద్రబాబు రోబోట్ లా అవే మాటలు మాట్లాడుతూ చాలాకాలం ఉంటారు. ఇప్పుడే ఆయన తన రాజకీయ వారసుడి గురించి ఆలోచించాల్సిన పనిలేదు. కానీ ఆయన తన రాజకీయ పాదుకులను కొడుకు లోకేష్ కోసం రిజర్వు చేసి ఉంచినట్టు గుప్పుమనడంతో నందమూరి వంశం మళ్ళీ అలర్ట్ అయింది. అన్నీ సెట్ చేసి ఇచ్చిన బిజినెస్ ల లోనే ముద్ద పప్పులా వ్యవహరిస్తున్న లోకేష్ రాజకీయాల్లో ఎలా రాణిస్తాడని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. బాలకృష్ణను రానీయకుండా చేయడానికే చంద్రబాబు ఈ ఫీలర్ వదిలారు కానీ ఆయనకు తన కుమారుడు రాజకీయాల్లోకి రావడం సుతరామూ ఇష్టం లేదని సన్నిహితులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+