తూర్పు గోదావరి జిల్లాలోని వంతాడలో ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి ఇటీవల విచిత్రమైన స్థితిని ఎదుర్కున్నారు. నిజంగానే హీరోలా ప్రవర్తించారు. వంతాడ అక్రమ ఖనిజ తవ్వకాల బాధితులను పరామర్శించడానికి ఆయన ఓ చెట్టు కింద కూర్చున్నారు. వారితో మాట్లాడుతుండగా చెట్టుపైన త్రాచుపాము కనిపించింది. దాని కిందనే చిరంజీవి కూర్చుని ఉన్నారు. అది కాటు వేస్తే అక్కడికక్కడ ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. ఆ చెట్టు కింద కూర్చున్నవారిపై ఆ పాము పడిపోయి కాటు వేయడం వల్ల చాలా మంది మరణించిన సంఘటనలున్నాయట. ఆ దృశ్యం చూసిన స్థానికుల్లో కలకలం మొదలైంది. మౌనంగా ఉండాలని చిరంజీవి వారికి సూచించాడు. పాములకు విషం ఉన్నప్పటికీ అవి మనుషులను ఏమీ చేయవని ఆయన చెప్పారు. తన తలపై విషపు పాము ఉన్నా లెక్క చేయకుండా ఆయన సమావేశం ముగించారు. సమావేశం ముగిసిన తర్వాత ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఆ పాము ఎవరి జోలికీ రాలేదు. చిరంజీవి వంటి మంచి మనుషులకు పాములు కూడా హాని తలపెట్టవని ప్రజలు అనుకున్నారు. ఏమైనా, చిరంజీవి ధైర్యాన్నే ప్రదర్శించారని చెప్పాలి.