చిరుతో స్ధానిక సంస్ధల ప్రయోగం?

చిరంజీవి పార్టీతో వచ్చే స్ధానిక సంస్ధల ఎన్నికల్లో కాంగ్రెసు ఒక పెద్ద ప్రయోగమే చేయబోతోంది. చిరంజీవి అడిగిన స్ధానాల్లో కొన్నిటికి అంగీకరించి ఎన్నికల పొత్తు కుదుర్చుకోవాలన్నది ఒక ఫార్ములా. ఎన్నికల పొత్తులో భాగంగా చిరంజీవి రాష్ట్రమంతటా తిరిగి కాంగ్రెసు-ప్రజారాజ్యం అలయెన్సు తరఫున ప్రచారం చేయవలసి ఉంటుంది. ఆ ప్రయోగం సఫలమైతే చిరంజీవి 2014 ఎన్నికల్లో ఈ లయెన్స్ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్ధి కావాలనుకుంటున్నారు. అందుకు కాంగ్రెసు హైకమాండ్ ఒప్పుకుంటుందా లేదా అన్నది ఇప్పటికి అప్రస్తుతం. స్ధానిక సంస్ధల ఎన్నికల్లో ఈ ప్రయోగం ఫలిస్తే చిరంజీవి కాంగ్రెసు హై కమాండ్ కు అల్లుడై కూర్చున్నట్టే. రాజకీయాల్లో కూడా బాగా సంపాదించుకునే అవకాశం వస్తుంది. తన మనుషులకు పదవులు ఇప్పించుకోవచ్చు.












Click it and Unblock the Notifications