వైయస్ జగన్ పై చర్యలు తప్పవా?

ఇప్పుడు చిరంజీవిని దువ్వుకోవడం ద్వారా కాంగ్రెసు హైకమాండ్ జగన్ ను వెక్కిరించినట్టైంది. జగన్ వర్గం ఈ విషయంలో బాధగానే ఉన్నట్టు కన్పిస్తోంది. జగన్ కు ఏదో పైపైన బలం తప్ప అన్నివర్గాల్లో మద్దతు లేదని నిర్ణయించుకున్న తర్వాతే హైకమాండ్ చకచకా పావులు కదుపుతోంది. వైయస్ శవం కూడా బయటికి వెళ్ళక ముందే జగన్ వర్గీయులు జగన్ ను సిఎం ను చేయాలని సంతకాల కార్యక్రమం చేపట్టడాన్ని ఆనాడే అధిష్టానం తీవ్రంగా పరిగణించింది. పవర్ మాంగర్ గా జగన్ పై ముద్రపడింది. జులై 8 నుంచి జగన్ ఓదార్పు యాత్ర సాగించడం మాత్రం ఖాయం. దానిపై అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడే చెప్పలేని విషయం.












Click it and Unblock the Notifications