జగన్ వల్ల మధ్యంతర ఎన్నికలొచ్చినా సోనియా రెఢీ

జగన్ సభల కంటే జూనియర్ ఎన్టీఆర్ కు, అంతకంటే చిరంజీవి సభకు జనం కదిలి వచ్చారన్న సంగతి హైకమాండ్ దృష్టికి వెళ్ళింది. మధ్యంతర ఎన్నికలు వచ్చినా చిరంజీవితో ప్రచారం చేయించుకుని విజయం సాధించవచ్చన్న విశ్వాసంతో హై కమాండ్ ఉంది. కాంగ్రెస్ కు ఉన్న 40 శాతం ఓటు బ్యాంకుకు తోడు చిరంజీవికి ఉన్న 18 శాతం ఓట్లు కలిస్తే కాంగ్రెస్ ప్రజారాజ్యం కూటమి ఘన విజయం సాధిస్తుందన్న నమ్మకంతో సోనియా గాంధీ ఉన్నారు. ధనబలంతో జగన్ సొంత పార్టీ పెట్టుకున్నా ఆయనకు వచ్చే ఓట్లు అతి తక్కువగా ఉంటాయన్న అంచనా ఆమెకుంది.
కాంగ్రెస్ అధిష్టానవర్గానికి , కడప ఎంపీ జగన్‌కూ మధ్య అగాథం పూడ్చలేనంతగా పెరుగుతోంది. రోజు రోజుకూ పదునెక్కుతున్న యువనేత స్వరాన్ని అధిష్ఠానం నిశితంగా గమనిస్తోంది. రోశయ్య సర్కారు పడిపోయినా, మధ్యంతరమే వచ్చినా జగన్ ఒత్తిడికి లొంగరాదనే అది కృత నిశ్చయానికి వచ్చినట్లు తెలుస్తోంది. జగన్ విషయంలో కఠిన వైఖరి ప్రదర్శించాలన్నదే అధిష్ఠానం ఆలోచన. జగన్ బెదిరింపులను వివిధ మార్గాల్లో ఎదుర్కోడానికి హైకమాండ్ సిద్ధమవుతున్నట్టు సమాచారం. కాంగ్రెస్ సీనియర్ నాయకులు చాలా మంది రోశయ్యను కలుసుకుని విధేయత చాటుకోవడం హై కమాండ్ వ్యూహాల ఫలితమేనని తెలుస్తోంది.
ఓదార్పు యాత్ర ధిక్కారంగా భావించేంత తీవ్రమైన విష యం కాదని ముఖ్యమంత్రి రోశయ్య చెబుతున్నప్పటికీ... జగన్ బహిరంగ సభల్లో చేసే వ్యాఖ్యలను మాత్రం అధిష్ఠానం సీరియస్‌గా తీసుకుంటోంది. సోనియా గాంధీ రాష్ట్ర పరిణామాలపై వస్తున్న వార్తలను నిశితంగా పరిశీలిస్తున్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications