రెడీ హిందీ సినిమా షూటింగ్ సందర్భంగా బాలీవుడ్ బ్యాడ్ బాయ్ సల్మాన్ ఖాన్ కన్ను తెలుగు నటి ఆసిన్ పడిందనే ఊహాగానాలున్నాయి. రెడీ తెలుగు సినిమాను సల్మాన్ హీరోగా హిందీలో రీమేక్ చేస్తున్నారు. సల్మాన్ చూపు మంచిది కాకపోవడంతో ఆ సినిమా షూటింగ్ ఆగిపోయిందని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే, ఇతరుల కంటిచూపు కూడా ఆసిన్ పాలిటి శాపంగా మారింది. శ్రీలంకలోని కొంత మంది తమిళుల కళ్లకు శస్త్రచికిత్స చేయించే కార్యక్రమాన్ని ఆసిన్ తీసుకుంది. అలా శస్త్రచికిత్స చేయించుకున్న పది కంటిచూపు కోల్పోయారట. దీంతో ఆమె చెన్నైలో క్రిమినల్ కేసు నమోదైనట్లు చెబుతున్నారు. శస్త్రచికిత్సలకు ఆసిన్ ను బాధ్యురాలిని చేస్తూ కొంత మంది న్యాయవాదులు ఆ పనికి ఒడిగట్టారు. శ్రీలంకలోని తమిళుల కంటి చూపు పోవడానికి కారణమైన ఆసిన్ కు జైలు శిక్ష పడుతుందని న్యాయవాది బాలమురుగన్ అంటున్నారు. మంచికి పోతే చెడు ఎదురైందంటే ఇదే కావచ్చు. పాపం ఆసిన్.