సబిత స్ధానంలో హోంలోకి రోశయ్య మనిషి!

ఏది ఏమి జరిగినా ఒక మార్పు అయితే ఖాయంలా కన్పిస్తోంది. హోం మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి కొనసాగబోవడం లేదు. ఆమెకు ప్రాధాన్యం లేని ఒక శాఖను ఇచ్చి, డిఎల్ రవీంద్రారెడ్డికి గానీ, మర్రి శశిధర్ రెడ్డికి గానీ ఆ శాఖను అప్పగించే అవకాశాలున్నాయి. మాజీ ముఖ్యమంత్రి కుమారుడైన శశిధర్ రెడ్డి వివాద రహితుడు, అధిష్టానం దృష్టిలో మంచివాడుగా పేరున్నవాడు. ఇక డిఎల్ రవీంద్రారెడ్డి వైఎస్ జగన్ కు వ్యతిరేక వర్గం. అతడిని హోమంత్రిని చేసి జగన్ గ్రూపునకు చెక్ పెట్టాలని రోశయ్య ఆలోచనగా ఆయన సన్నిహితులు ప్రచారం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications