తెలంగాణ ఏర్పాటుపై అనుమాన మేఘాలు?

కెసిఆర్ ఈనెల 17న లోక్ సభ స్పీకరుకు రాజీనామా సమర్పించిన తర్వాత అసలు ఉద్యమం బయటపడుతుందని తెలంగాణ వాదులు వ్యాఖ్యానిస్తున్నారు. శ్రీకృష్ణ కమిటీపై చుక్కా రామయ్య నేడు ఎంచక్కా పెదవి విరిచారు. ఆ కమిటీతో తెలంగాణ రాష్ట్రం కృష్ణార్పణమైపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు తెలంగాణ విషయంలో చంద్రబాబు నాయుడు తన సహజమైన కపట దోరణిని చూపుతున్నారని టిఆర్ ఎస్ నాయకులు విమర్శిస్తున్నారు. శ్రీకృష్ణ కమిటి నివేదికను శ్రీరామ కమిటీకి నివేదిస్తారన్న జోక్స్ విన్పిస్తున్నాయి.












Click it and Unblock the Notifications