డ్రగ్స్ మాఫియా తెలుగు సినీ రంగాన్ని కుదిపేసింది. దాని సెగ సినీ నటుడు దగ్గుబాటి రాణాకు కూడా తాకినట్లుంది. ఆయన మీడియాపై రుసరుసలాడుతున్నారు. మీడియాపై ఫైర్ అవుతున్నాడు. డ్రగ్స్ వ్యవహారంలో మీడియా అతి ప్రతిస్పందిస్తోందని ఆయన ధుమధుమలాడుతున్నారు. దాన్ని ఎక్కువగా ఫోకస్ చేయవద్దని హితవు పలుకుతున్నాడు. తీగ లాగితే డొంక కదిలినట్లు హీరో రవితేజ సోదరులు పట్టుబడిన తర్వాత ఎవరెవరికి లింకులున్నాయో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇదే సమయంలో సెక్స్ రాకెట్ కూడా సినీ రంగాన్ని కుదుపు కుదిపింది. ఈ స్థితిలో రాణా తన అక్కసును మీడియాపై వెళ్లగక్కాడు. గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకోవడం అంటే ఇదే కావచ్చు.