రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా గాలి జనార్ధన్ రెడ్డి!

వచ్చే నెలలో జరుగనున్న బిజెపి చింతన్ బైఠక్ లో గాలి జనార్ధన రెడ్డిని ఆంధ్రప్రదేశ్ బిజెపి వ్యవహారాల ఇంచార్జిగా చేసే విషయం ఖరారు కానుంది. కర్ణాటకలో బిజెపి విజయంలో తన ధనబలం ద్వారా కీలకపాత్ర వహించిన గాలి జనార్ధన్ రెడ్డి సేవలను పూర్తి స్ధాయిలో ఆంధ్రప్రదేశ్ లో ఉపయోగించుకోవాలని బిజెపి అగ్ర నాయకత్వం ఆలోచిస్తోంది. అయితే కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పకు ఒక మంత్రిగా ఇబ్బందిపెడుతున్న గాలి జనార్ధన రెడ్డి సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కు బదిలీ చేయాలనుకుంటున్నట్టు మరో వెర్షన్.












Click it and Unblock the Notifications