వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'వార్త' సంఘీకి దుర్వార్తేనా?

By Santaram
|
Google Oneindia TeluguNews

Girish Sanghi
'వార్త 'పత్రిక అధిపతి, రాజ్యసభ సభ్యుడు గిరీష్ సంఘికి పరిస్ధితులు కలివస్తున్నట్టుగా లేవు. సంఘి గ్రూపు నష్టాల్లో ఉంది. వార్త దినపత్రిక సర్క్యులేషన్ దారుణంగా పడిపోయింది. రాజ్యసభ సభ్యుడిగా మరోసారి సంఘీకి అవకాశం లభించడం కష్టమే. మరోసారి ఆయనను రాజ్యసభకు పంపే అంశంపై కాంగ్రెసు‌ అధిష్టానం ఆచితూచీ వ్యవహరిస్తోంది. 2004 ఎన్నికల్లో కాంగ్రెసు‌ గెలుపుకోసం ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్న పత్రిక అండగా నిలిచిందనే కృతజ్ఞతతో గిరీష్‌కు దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి రాజ్యసభ పదవిని కట్టబెట్టారు.

అయితే, ఈ పదవిని దుర్వినియోగం చేశారనే అభియోగం ఎదుర్కొన్న ఆయనను మరోసారి పెద్దల సభకు పంపడం కష్టమేనని విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ఢిల్లీలోని తన క్వార్టర్‌ను నిబంధనలకు విరుద్ధంగా మార్చడం..వ్యాపార కార్యకలాపాలకు వినియోగించినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి. బీహార్‌ రాష్ట్ర ఇన్‌చార్జిగా విధుల నిర్వహణలోనూ సరిగా పనిచేయలేదని అధిష్టానం భావిస్తోంది. ఈ నేపథ్యంలో సంఘీని తప్పించి ఆ స్థానంలో కేంద్ర మాజీమంత్రి రేణుకాచౌదరికి రాజ్యసభ సీటు కేటాయించడం ఉత్తమమని పార్టీ అంచనాకు వచ్చినట్లు పీసీసీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. రోశయ్య, గిరీష్ సంఘీ ఒకే వైశ్య కులానికి చెందినవారు. అయితే సంఘీకి రోశయ్య ఈసారి సహాయం చేయడం కష్టమని పరిశీలకులు అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X